Header Banner

రాష్ట్ర ఆర్థిక పునరుద్ధరణకు లక్ష్యంగా సీఎం చంద్రబాబు నిర్ణయాలు! ల్యాండ్ గ్రాబింగ్, డ్రగ్స్ నిర్మూలనపై కీలక చర్యలు!

  Wed Mar 05, 2025 21:58        Politics

ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు కీలక సమావేశాలు జరిగాయని తెలిపారు. హోంమంత్రితో జరిగిన చర్చలో రాజకీయ పరిణామాలు, ఎన్డీయే భవిష్యత్ కార్యాచరణపై చర్చించామని చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లుపై చర్చ సాగిందని, భూముల కంప్యూటరీకరణలో వచ్చిన సమస్యలు, గత పాలకుల హయాంలో జరిగిన అక్రమాలపై చర్చించినట్టు వివరించారు. గుజరాత్‌లో విజయవంతంగా అమలు చేసిన ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును ఏపీలో కూడా త్వరగా అమలు చేయాలని కోరారు.

ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు పట్టణ, గ్రామీణ భూముల గురించి ప్రస్తావిస్తుందని, దీని అమలుతో నేరాలపై పీడీ కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గంజాయి సాగు, డ్రగ్స్ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టామని, వీటి నిర్మూలనకు సమర్థమైన వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గంజాయి కట్టడి చర్యలకు తోడు ఉపాధి అవకాశాలు, ప్రోత్సాహకాలు కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాకుండా, డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి మరో ప్రత్యేక బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నామని వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: రాజధానికి హడ్కో, ప్రపంచ బ్యాంక్, ADB నుంచి నిధులు! మంత్రి నారాయణ కీలక ప్రకటన!



ఆర్థిక పరమైన విషయాల గురించి ఆర్థికమంత్రితో చర్చించామని, గత ప్రభుత్వ హయాంలో భారీగా అప్పులు చేశారని, ప్రస్తుతం ఏపీకి రుణ సామర్థ్యం లేకుండా పోయిందని నీతిఆయోగ్ నివేదించిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు 12.94% వృద్ధిరేటుతో ముందుకు వెళ్తున్నామని, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. పోలవరం-బనకచర్ల అనుసంధానంతో రాయలసీమకు గేట్వేగా మారుతుందని, వృథాగా సముద్రంలోకి వెళ్లే నీటిని ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.

రహదారుల అభివృద్ధిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చించామని, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, శ్రీశైలం రోడ్ల విస్తరణ, ఎలివేటెడ్ రోడ్ల నిర్మాణంపై హామీ లభించిందని తెలిపారు. అలాగే, వినుకొండ-అమరావతి, విశాఖ-మూలపేట రహదారుల ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం సహకారం అందిస్తోందని, ప్రత్యేకంగా పోలవరానికి ఈ ఏడాది రూ.5 వేల కోట్లు వెచ్చించనున్నట్టు వెల్లడించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #AndhraPradesh #APDevelopment #ChandrababuNaidu #PolavaramProject #LandGrabbingBill #Rayalaseema #InfrastructureGrowth #NDAAlliance #EconomicReforms #APProgress